వనస్థలిపురంలో మహిళను ట్రాప్ చేసి నకిలీ బంగారం అంటగట్టి పరార్...
హైదరాబాద్ వనస్థలిపురంలో ఓమహిళను ట్రాప్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.;
హైదరాబాద్ వనస్థలిపురంలో ఓమహిళను ట్రాప్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మాభూమిలో బంగారం దొరికిందని.. తక్కువ రేటు ఆశచూపి మహిళను నమ్మించాడు వీరబాబు అనే వ్యక్తి. ఈనేపథ్యంలో కొంచెం బంగారం ముక్కచూపి.. ఆమె నుంచి 2 లక్షల 30 వేల నగదును పట్టుకెళ్లారు. తీరా ఆ బంగారం నకిలీదని తేలడంతో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.