UP Boat Accident : యూపీలో ఘోర పడవ ప్రమాదం.. 20 మంది మృతి
UP Boad Accident : బాందా వద్ద యమునా నదిలో పడవ బోల్తా పడటంతో 20మంది చనిపోయారు. మరో 30మంది గల్లంతయ్యారు.;
UP Boat Accident : యూపీలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. బాందా వద్ద యమునా నదిలో పడవ బోల్తా పడటంతో 20మంది చనిపోయారు. మరో 30మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇప్పటికే 20మంది మృతదేహాలు బయటకు తీశారు.
Upబాందా ఘాట్ నుంచి ఫతేపూర్ వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. పడవలో మొత్తం 50మంది ప్రయాణికులున్నారు. బరువు ఎక్కువై, బ్యాలెన్స్ తప్పడంతో పడవ బోల్తా పడింది. రేపు రాఖీ పండుగ ఉండటంతో జనమంతా సొంతూళ్లకు వెళ్తున్నారు. ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో మహిళలే ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు.