బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ను చంపేస్తామంటూ దుండగులు బెదిరింపులకు దిగారు. షారుక్‌కు ఫోన్ చేసిన దుండగులు..నెక్ట్స్ చంపేది నిన్నే అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో అలర్టైన బాంద్రా పోలీసులు ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎఫ్ఐఆర్ బీఎన్ఎస్ 308(4), 351(3)(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాల్‌ను ట్రేస్ చేసి రాయ్‌పూర్ లోని ఫైజాన్ ఖాన్ అనే వ్యక్తి ఫోన్‌ను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రాథమికంగా విచారణ చేస్తున్నారు.