Meerpet Murder Case : భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. కీలక ఆధారాలు లభ్యం
హైదరాబాద్ మీర్‌పేట్‌లో భార్యను కిరాతకంగా నరికి ముక్కలు ఉడికించిన కేసులో పోలీసులు కీలక ఆధారాలు గుర్తించారు. శరీర భాగాలను కాల్చిన ఆనవాళ్లను సేకరించారు. వాటి DNA శాంపిల్స్ తీసుకున్న పోలీసులు పిల్లల DNAతో టెస్ట్ చేయనున్నారు. భార్య మాధవి హత్యకు గురుమూర్తి ఉపయోగించిన పలు వస్తువులను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో శుభ్రం చేసిన రక్తపు మరకలను ఇన్‌ఫ్రారెడ్ ద్వారా గుర్తించారు.
భార్య వెంకటమాధవిని అత్యంత క్రూరంగా చంపిన గురుమూర్తి పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ‘అవును నేనే చంపా. మీ వద్ద సాక్ష్యాలున్నాయా? నాపై కేసు పెట్టి రిమాండ్ చేయండి. అంతా కోర్టులోనే చూసుకుంటా’ అని సవాల్ విసిరినట్లు తెలుస్తోంది. ఇంట్లో రక్తం మరకలు లేకపోవడం, వాసన కూడా రాకపోవడంతో ‘ముక్కలు’గా నరికిన విషయం నిజమేనా? లేక తమను తప్పుదోవ పట్టిస్తున్నాడా? అని పోలీసులు ఆలోచనలో పడ్డట్లు సమాచారం.