కేపీహెచ్బీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను కరెంట్ షాక్ తో చంపేసి పూడ్చిపెట్టిందో మహిళ. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు సొంతూరికి వెళ్లి పోయింది. కేపీహెచ్బీ కాలనీలో నివాసం ఉంటున్న సాయిలు, కవిత దంపతులు. వీరిద్దరూ గత 15 ఏండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇద్దరికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయి. అయితే కొద్ది నెలలుగా వీరి మళ్లీ కలిసి ఒకటిగా ఉంటున్నారు. ఈ క్రమంలో సాయిలు ఆమెను వేధింపులకు గురిచేయగా.. కవిత విసుగు చెందింది. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. తన చెల్లెలు భర్తతో కలిసి సాయిలును మర్డర్ చేసేందుకు నిర్ణయించుకుంది. ప్లాన్ ప్రకారం భర్త సాయిల్ కు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారు. మృతిచెందిన తర్వాత సాయిలు డెడ్ బాడీని పూడ్చి పెట్టారు. ఇటీవల కవిత తన సొంతూరు వెళ్లి.. భర్త సాయిలు పనికి వెళ్లి తిరిగి రాలేదని అక్కడి వారితో చెప్పింది. అనుమానం వచ్చిన ఆయన బంధువులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. భార్యే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్త వేధింపులు భరించలేక సాయిలును భార్యే కరెంట్ కు పెట్టి చంపేసినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది.