మామ నచ్చాడని.. కట్టుకున్న భర్తను దారుణంగా మర్డర్ చేపించిన ఘటన బిహర్ లో చోటుచేసుకుంది. ఔరంగాబాద్ జిల్లాలో తన మామను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో అందుకు అడ్డుగా ఉన్న భర్తను అతడి భార్యే సుపారీ గ్యాంగ్తో హత్య చేయించింది. గుంజాదేవి (20), ప్రియాంశు (25)లకు 45 రోజుల క్రితమే వివాహం జరిగింది. పెండ్లికి ముందే దేవీ, ఆమె మామ జీవన్సింగ్ (55) లు ప్రేమలో ఉన్నారు. ఈ విషయం ఇంట్లో చెప్పగా.. కుటుంబసభ్యులు నిరాకరించారు. ఆ తర్వాత ప్రియాంశుతో దేవీకి ఇష్టం లేకుండా పెండ్లి చేశారు. దీంతో భర్త అడ్డు తొలగించు కోవాలని దేవీ భావించింది. ఇందుకు సుపారీ గ్యాంగ్తో డీల్ కుదుర్చుకుంది. గతనెల 25న ప్రియాంశు తన అక్కను కలిసేందుకు వెళ్లి రైలులో తిరిగి పయనమయ్యాడు. ఈక్రమంలో నవీనగర్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. నిందితురాలు అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా.. కుటుంబ సభ్యులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆమె కాల్ రికార్డు లను పరిశీలించగా.. జీవన్ తరచూ టచ్ ఉన్నట్లు తెలిసింది.. అతడి పరిశీలిస్తే సుపారీ గ్యాంగ్తో జరిపినట్లు తేలింది.