Visakhapatnam: విశాఖ సూర్యాబాగ్ ఘటనలో నిందితుడు హర్షవర్ధన్ రెడ్డి మృతి
Visakhapatnam: ఈ ఘటనలో బాధితురాలి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెప్పారు డాక్టర్లు.;
Visakhapatnam : విశాఖ సూర్యాబాగ్ ఘటన నిందితుడు హర్షవర్దన్ రెడ్డి చనిపోయాడు. ఈ నెల 13 తీవ్ర గాయాలతో KGHలో చేరిన హర్షవర్ధన్...చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనలో బాధితురాలి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెప్పారు డాక్టర్లు.
విశాఖపట్టణం సూర్యాబాగ్ హోటల్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విశాఖకు చెందిన యువతి, భూపాలపల్లి జిల్లాకు చెందిన హర్షవర్ధన్‌రెడ్డి మంటల్లో కాలుతూ కనిపించారు. స్పందించిన స్థానికులు వెంటనే హాస్పిటల్ కు తరలించారు.
ఈ ఘటనలో యువతి నడుం భాగం నుంచి ముఖం వరకు తీవ్రంగా కాలిపోగా...హర్షవర్ధన్‌రెడ్డి ముఖం నుంచి కాళ్ల వరకు తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ప్రేమను నిరాకరించిందన్న కారణంతో హర్షవర్ధన్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చారు.
యువతిని హత్య చేయాలన్న ఉద్దేశంతోనే విశాఖ వచ్చినట్లు నిర్ధారించారు. నిందితుడిప హత్యాయత్నంతో పాటు ఆత్మహత్యాయత్నం కేసులు నమోదు చేశారు.