ఈ మధ్య మహిళలు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ప్రియుడు కోసం భర్తలను చంపడం, డబ్బు కోసం ప్రియుడిని మోసం చేస్తున్న ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. డబ్బు కోసం యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేయించింది. దుబాయ్‌కు చెందిన ఓ ట్రావెల్ సంస్థలో లారెన్స్ మెల్విన్ అనే వ్యక్తి మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతడిని తన గర్ల్‌ఫ్రెండ్ మహిమావత్ బెంగళూరులో కిడ్నాప్ చేయించింది. ఆ తర్వాత రూ.2.5 కోట్లు ఇస్తేనే విడిపిపెడతామని కుటుంబభ్యులకు ఫోన్ చేసి బెదిరించింది.
ఈ క్రమంలో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లారెన్స్ సెలవులపై దుబాయ్ నుంచి ఇండియా వచ్చాడు. బెంగళూరులోని ఓ హోటల్లో రూమ్ తీసుకున్నాడు. అతడి లవర్ మహిమ బయటకు వెళ్దామని చెప్పడంతో కారులో బయలుదేరారు. అప్పటికే మహిళ ప్లానింగ్ ప్రకారం.. మరో ఇద్దరు వ్యక్తులు కారులో ఎక్కి లారెన్స్ పై దాడికి దిగారు. అతడి వద్ద ఉన్న లక్ష రూపాయలను తీసుకుని ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ లో బంధించారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు ఫోన్ చేసి రూ.2.5కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అపార్ట్‌మెంట్ వాసులకు అనుమానం కలగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు లారెన్స్‌ను విడిపించి నిందితులను అరెస్ట్ చేశారు.