బావిలో యువకుడి డెడ్ బాడీ స్వాధీనం చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పాత తాండూరులోని నిజాం షాహీ దర్గా సమీపంలో బావిలో గురువారం ఉదయం గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెళ్లి బావిలోంచి డెడ్ బాడీని బయటకు తీసి.. మృతుడి వివరాలు తెలియకపోవడంతో పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా జెట్టిపాగ వెంకటేశ్(35) , రైల్వే ట్రాక్ పక్కన, అంబేద్కర్ నగర్, ఓల్డ్ తాండూరు ప్రాంతంగా తెలిసింది. మృతుడి తల్లి చంద్రమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు సెంట్రింగ్ పని చేస్తూ యాదగిరిగుట్ట, హైదరాబాద్ లో ఉండేవాడని, ఐదేండ్ల కిందట తాగుడుకు బానిసవగా వెంకటేశ్ భార్య వదిలి పెట్టింది. వారం కిందట సిటీ నుంచి ఇంటికి వచ్చిన అతడు ఫోన్ ఇంట్లోనే పెట్టేసి బయటికి వెళ్లాడని, మరుసటిరోజు బావిలో శవమై కనిపించాడని టౌన్ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు.