Hyderabad: అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి యూట్యూబర్ ఆత్మహత్య.. అదే కారణం..
Hyderabad: హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది..;
Hyderabad: హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది.. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రాంతి నగర్ కాలనీలో అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.. మృతిచెందిన విద్యార్థి డీనాగా పోలీసులు గుర్తించారు.. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు..
క్లూస్ టీమ్ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.. తన బలవన్మరణానికి కారణం తన యూట్యూబ్ ఛాలెన్‌కు వీక్షకులు లేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇంజినీరింగ్ స్టూడెంట్ డీనా రాసిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.