TTD : శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

Update: 2024-05-30 06:10 GMT

ఏడుకొండలపై కొలువుతీరిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా, దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా అధికల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.

ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని.. ఇక, 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. నిన్న ఏడుకొండలవాడిని 73,811 మంది దర్శించుకున్నారు. 34,901 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.19 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Similar News