Mahashivaratri 2021: రోజూ 3 సార్లు రంగులు మారే శివలింగం.. !

దేశంలో చాలా పురాతమైన ఆలయాలు ఉన్నాయి. అందులో రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఉన్న'అచలేశ్వర మహాదేవ దేవాలయం' ఒకటి. మహాశివరాత్రి పర్వదినాన ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..!

Update: 2021-03-11 03:30 GMT

దేశంలో చాలా పురాతమైన ఆలయాలు ఉన్నాయి. అందులో రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఉన్న'అచలేశ్వర మహాదేవ దేవాలయం' ఒకటి. మహాశివరాత్రి పర్వదినాన ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..!

దాదాపుగా 2500 సంవత్సరాల చరిత్ర ఈ ఆలయానికి ఉంది. ఇక్కడి గర్భగుడిలో ఉన్న శివలింగానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడీ శివలింగం.. రోజులో మూడుసార్లు రంగులు మారుతూ భక్తలను ఆశ్చర్యపరుస్తుంది. ఉదయం ఎరుపు వర్ణంలో, మధ్యాహ్నం కాషాయ రంగులో, సాయంత్రం నలుపు రంగులోకి మారుతుంది.

ఇక్కడి ఆలయంలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ శివలింగం పక్కకు కదులుతుంటుంది. అయితే శివలింగం రంగుల మారడానికి గల కారణాలను కనుకునేందుకు పురాతత్వ శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం సాధించలేకపోయారు. ఇది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.


ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే... ఈ ఆలయం లోపల సగం గుడ్రంగా ఉన్న ఓ చిన్న గొయ్యి ఉంటుంది. అది శివుడి బొటనవేలుగా చెబుతుంటారు. ఎవరైనా ఆ కన్నంలో నీరు పోస్తే ఆ నీరు మాయమవుతుంది. ఆ నీరు ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు.

ఇక ఈ ఆలయంలో నంది మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీనిని పంచలోహాలతో తయారుచేశారు. మహాశివరాత్రి రోజున ఈ ఆలయంలో భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. 

Tags:    

Similar News