Telugu Horoscope Today : ఈ రాశివారికి ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి
Telugu Horoscope Today : శ్రీ ప్లవ నామ సంవత్సరం, వారం : మంగళవారం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి శు.తదియ ఉ.6.54 వరకు, తదుపరి చవితి తె.4.55 వరకు (తెల్లవారితే బుధవారం);
Telugu Horoscope Today : శ్రీ ప్లవ నామ సంవత్సరం, వారం : మంగళవారం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి శు.తదియ ఉ.6.54 వరకు, తదుపరి చవితి తె.4.55 వరకు (తెల్లవారితే బుధవారం), నక్షత్రం పూర్వాషాఢ ఉ.7.03 వరకు, తదుపరి ఉత్తరాషాఢ తె.5.44 వరకు, వర్జ్యం ప.2.36 నుండి 4.08 వరకు, దుర్ముహూర్తం ఉ.8.34 నుండి 9.16 వరకు, తదుపరి రా.10.32 నుండి 11.24 వరకు, అమృతఘడియలు... రా.11.40 నుండి 1.10 వరకు, సూర్యోదయం : 6.21 : సూర్యాస్తమయం : 5.21 : రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు : యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
రాశిఫలాలు
మేషం : మిత్రులతో కలహాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు చేసుకుంటారు. పనులలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.
వృషభం : పనులు నత్తనడకన సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటన. భూవివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
మిథునం : ముఖ్యమైన పనులు మందగిస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
కర్కాటకం : సన్నిహితులతో సఖ్యత. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
సింహం : మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.
కన్య : శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆసక్తికర సమాచారం. కీలక నిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
తుల : ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి కొనుగోలు యత్నాలు సఫలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వృశ్చికం : రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.
ధనుస్సు : సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు రద్దు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
మకరం : పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.
కుంభం : సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. భూవివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.
మీనం : పరిచయాలు విస్తృతమవుతాయి. మీ ప్రతిపాదనలు అందరూ హర్షిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.