Devi Navaratrulu : కోల్‌కత్తాలో వెరైటీగా దేవి నవరాత్రి ఉత్సవాలు..!
దేశవ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉత్సవాల కమిటీ నిర్వాహకులు వెరైటీగా ఆలోచించారు.;
దేశవ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉత్సవాల కమిటీ నిర్వాహకులు వెరైటీగా ఆలోచించారు. అందరిలాగ కాకుండా ప్రత్యేకంగా అమ్మవారి మండపాన్ని అలంకరించారు. పాత హిందీ, ఇంగ్లీష్ సినిమాల పోస్టర్లతో మండపాన్ని ఏర్పాటు చేశారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ షోలే మొదలుకొని లేటెస్టుగా హిట్ అయిన సినిమాల వరకు మండపం లోపల, బయట ఫుల్‌గా నింపేసారు. చుట్టూ సినిమా పోస్టర్లు.. మధ్యలో అమ్మవారు ఉన్న ఈ వెరైటీ దేవి నవరాత్రి ఉత్సవాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.