Maha Kumbh Mela : మహా కుంభమేళాకు అంతా సిద్ధం.. 45 రోజుల పాటు అద్భుతమైన ఆధ్యాత్మిక జాతర

Update: 2025-01-06 09:00 GMT

మహా కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. 45 రోజుల పాటు జరగనున్న ఈ మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి భక్తులు, నాగ సాధువులు సహా అనేక మంది విచ్చేయనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈనెల 13 నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26న ఈ మహా కుంభమేళా ముగియనుంది. నగరంలోని ప్రతీప్రాంతాన్ని అధికారులు అందంగా తీర్చిదిద్దారు. ఈ నేపధ్యంలో ప్రయాగ్‌రాజ్‌ రైల్వే స్టేషన్‌ను అంత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్ ప్రతిష్టను మరింతగా పెంచడంలో భారతీయ రైల్వే కూడా గొప్ప పాత్ర పోషిస్తోంది. పెయింట్ మై సిటీ ప్రచారం పేరిట ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వేస్టేషన్‌ను అద్భుత కళ, అందమైన సంస్కృతికి నిలయంగా మార్చారు. ప్రయాగ్‌రాజ్, ప్రయాగ్‌రాజ్ జంక్షన్, నైని జంక్షన్, ఫఫామౌ, ఝూన్సీ రైల్వే స్టేషన్, రాంబాగ్ రైల్వే స్టేషన్, చివ్కీ రైల్వే స్టేషన్, ప్రయాగ్‌రాజ్ సంగమ్‌ రైల్వే స్టేషన్, సుబేదర్‌గంజ్ రైల్వే స్టేషన్‌లన్నింటినీ అత్యంత సుందరంగా మలచారు. రైల్వే స్టేషన్‌ గోడలపై రామాయణం, శ్రీకృష్ణ లీలలు, బుద్ధుడు, శివ భక్తి, గంగా హారతి, మహిళా సాధికారత తదితర చిత్రాలను రూపొందించారు.

ప్రస్తుతం జరగనున్న కుంభమేళా మహా కుంభమేళా అని.. ఇది 144 ఏళ్లకు ఒకసారి వస్తుందని చెబుతున్నారు. సాధారణంగా 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళాను.. 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తే.. ఈ మహా కుంభమేళాను మాత్రం 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా మన దేశంలో కుంభమేళాలను కేవలం 4 ప్రాంతాల్లో మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్.. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ.. మహారాష్ట్రలోని నాసిక్‌లో కుంభమేళాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాను మాత్రం కేవలం ప్రయాగ్‌రాజ్‌లోనే నిర్వహిస్తారు.

Tags:    

Similar News