Mahashivratri: మహాశివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా.. మరైతే ఈ విషయాలు తప్పక తెలుసుకోవలసిందే..
Mahashivratri: మహాశివరాత్రి.. శివుని ఆరాధించే భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. శివరాత్రి అంటే శివుని ఆరాధనలో ఉపవాసం, జాగారం చేసి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావడం.;
Mahashivaratri: మహాశివరాత్రి.. శివుని ఆరాధించే భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. శివరాత్రి అంటే శివుని ఆరాధనలో ఉపవాసం, జాగారం చేసి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావడం.శివుడు పార్వతి దేవిని వివాహం చేసుకున్న రోజుగా భక్తులు శివరాత్రిని జరుపుకుంటారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు రోజంతా ఉపవాస దీక్షలు చేసి శివుడిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఉపవాసం పండుగ రోజు ఉదయం ప్రారంభమై మరుసటి రోజు ఉదయం ముగుస్తుంది. మహాశివరాత్రితో సహా ప్రతి నెలలో ఒక శివరాత్రి ఉంటుంది. ఉపవాస నియమాలు ఒకే విధంగా ఉంటాయి.
మహాశివరాత్రి ఉపవాసం యొక్క ప్రత్యేకత..
ఈ రోజున శివుడిని ఆరాధించే వారు భగవంతుని అనుగ్రహం పొంది మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. ఈ రోజు ఉపవాసం ఒక సంవత్సరం మొత్తం కఠినమైన ప్రార్థన యొక్క ప్రయోజనాలకు సమానం! ఎవరైతే తనను ఆరాధిస్తారో, మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటారో, వారు తన కుమారుడు కార్తికేయుడి కంటే ప్రీతిపాత్రులు అవుతారని శివుడు వాగ్దానం చేసినట్లు గ్రంధాలు ఉటంకించాయి!
కాబట్టి, మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి, శివుని ఆరాధించడానికి సిధ్దంగా ఉండండి.. ఉపవాస దీక్షకు ఉపక్రమించే ముందు మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. బలవంతంగా చేసేది ఏదీ కూడా ముక్తిని ఇవ్వదు. ఉపవాస దీక్షలో మీరు ఆరోగ్యంగా ఉండేదుకు, మీ శరీరం హైడ్రేటెడ్, డిటాక్సిఫైడ్ పొందడంలో మీకు సహాయపడటానికి ఇక్కడ కొన్ని ఉపవాస చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
1. మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి
మీరు పవిత్రమైన, స్వచ్ఛమైన లక్ష్యం కోసం ఉపవాసాన్ని పాటిస్తున్నందున, సంతోషంగా, ప్రశాంతంగా శివనామస్మరణలో ఉండడం వల్ల రోజంతా సాఫీగా గడిచేందుకు మీకు సహాయం చేస్తుంది. ఒత్తిడి లేకుండా ఉండండి. ఇది మీ ఉపవాసాన్ని మరింత సులభంగా నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది.
2. మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోండి
మీ శరీరాన్ని, మీ మనస్సుని శుద్ధి చేయడానికి మీరు ఉపవాసం ప్రారంభించారని గుర్తుంచుకోండి. కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి అని గుర్తుంచుకోండి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ని, వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. మీరు నీరు మాత్రమే తీసుకుని ఉపవాసం ఉండాలనుకుంటే మరిన్ని ఎక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది. అయితే గ్యాపస్, అసిడిటీ వంటి సమస్యలు ఉంటే నీటితో పాటు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
3. శారీరక శ్రమను నివారించండి
మీరు ఉపవాసం ఉన్నప్పుడు, రోజంతా చురుకుగా ఉండటానికి శారీరక శ్రమకు బదులు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, భక్తి సంగీతం వినడం, మనస్సుకు విశ్రాంతినిచ్చే ధ్యానం చేయడం వంటి వాటిని ఎంచుకోండి.
4. డిటాక్స్ కోసం ద్రవాలను ఎంచుకోండి
వివిధ రకాల ద్రవ ఆహారాలతో ఉపవాసం చేయడం అనేది కష్టంగా భావిస్తే, జ్యూస్‌లు, పాలు, మిల్క్‌షేక్‌లు, హెర్బల్ టీ, పెరుగు లేదా మజ్జిగను చేర్చుకోవచ్చు. ఆరోగ్య సమస్యలను కలిగి ఉన్న వ్యక్తులకు ఇవి ఆరోగ్యకరమైన ఎంపికలు. ఉదాహరణకు, గర్భిణీ స్త్రీలు, మధుమేహం, జీర్ణ సమస్యలు, బలహీనత, వివిధ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పై ద్రవాలను కచ్చితంగా తీసుకోవాలి. అప్పుడే మీ ఉపవాసాని ఫలితం ఉంటుంది.
5. తేలికగా తినండి (అవసరమైతే)
మీరు మీ ఉపవాసంలో పండ్లు మరియు తేలికపాటి భోజనాన్ని చేర్చాలని ఎంచుకుంటే, ఆహారం మృదువుగా పరిమిత పరిమాణంలో ఉండేలా చూసుకోండి. అప్పుడు మీ దృష్టి దైవం మీదకు మళ్లుతుంది. ఏకాగ్రతతో ధ్యానం మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.