Ganesh Chaturthi Special: బుజ్జిగణపయ్యకు.. బొజ్జనిండేలా.. టేస్టీ కేసర్ మావా మోదక్
Ganesh Chaturthi Special: ఈసారి గణేష్ చతుర్థికి స్పెషల్‌గా రుచికరమైన కేసర్ మావా మోదక్‌లు చేద్దాం. కుడుములు, ఉండ్రాళ్లు, మోదక్‌లు గణేశుడికి ఇష్టమైన వంటకాలు..;
Ganesh Chaturthi Special: ఈసారి గణేష్ చతుర్థికి స్పెషల్‌గా రుచికరమైన కేసర్ మావా మోదక్‌లు చేద్దాం. కుడుములు, ఉండ్రాళ్లు, మోదక్‌లు గణేశుడికి ఇష్టమైన వంటకాలు..
ఎప్పుడూ చేసే మాదిరిగా కాకుండా ఈసారి మోదక్‌లు కాస్త వెరైటీగా చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. ఉడికించాల్సిన అవసరం లేదు.. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉండే మీ మోదక్‌లు తీని గణేశుడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించేస్తాడు.. మరి తయారీ విధానం ఎలానో తెలుసుకుందాం..
కావలసినవి:
పాలు - 1/2 కప్పు
దేశీ నెయ్యి - 1 టేబుల్ స్పూన్
పాలపొడి - 1 కప్పు
కుంకుమ పువ్వు కొద్దిగా
చక్కెర - 1/4 కప్పు
తరిగిన డ్రై ఫ్రూట్స్ తగినంత
తయారీ విధానం..
1) ముందుగా పాన్‌లో కొంచెం పాలను వేడి చేయండి. అందులోనే కాస్త దేశీ నెయ్యి వేసి పాలలో బాగా కలపాలి.
2) మిల్క్ పౌడర్ వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గర పడుతుంది.
3) ఇప్పుడు దానికి కొంత రుచిని జోడించేందుకు కుంకుమ పువ్వు వేసి బాగా కలపాలి. అందులోనే తరిగిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలపాలి.
4) తర్వాత స్టౌ మీద నుంచి దించి ఈ మిశ్రమాన్ని బాగా ఆరనివ్వాలి. మోదక్ మేకర్ సహాయంతో తయారు చేసి గణేశుడికి నైవేద్యంగా అర్పించండి.