GANESH VISARJAN: పైన పూల వర్షం...కింద భక్త జన సంద్రం

ముంబైలో ఘనంగా వినాయక నిమజ్జనం... విమానంతో గణనాథుడిపై పూల వర్షం... శోభాయాత్రలో పాల్గొన్న లక్షలమంది భక్తులు

Update: 2025-09-07 04:30 GMT

ముం­బై మహా నగ­రం­లో వి­నా­యక ని­మ­జ్జ­నం అం­గ­రంగ వై­భ­వం­గా సా­గిం­ది. ముం­బై రో­డ్లు గణే­శుల శో­భా­యా­త్ర­తో కి­క్కి­రి­సి­పో­యా­యి. పె­ద్ద సం­ఖ్య­లో బొ­జ్జ గణ­ప­య్య­లు గం­గ­మ్మ­ను చే­ర­ను­న్నా­రు. వి­నా­యక ని­మ­జ్జ­నా­ల­కు సం­బం­ధిం­చి బీ­ఎం­సీ కట్టు­ది­ట్ట­మైన ఏర్పా­టు చే­సిం­ది. వి­నా­య­కుల ని­మ­జ్జ­నం కోసం కొ­న్ని లక్షల మంది రో­డ్ల­పై­కి వచ్చా­రు. సము­ద్రం­తో పాటు చె­రు­వు­లు, నీటి కుం­ట­లు, కృ­త్తి­మం­గా తయా­రు చే­సిన కుం­ట­ల్లో వి­నా­య­కు­ల­ను ని­మ­జ్జ­నం జరి­గిం­ది. ముం­బై ప్ర­ధాన వీ­ధు­లు, రహ­దా­రు­ల­పై భారీ గణ­ప­తి వి­గ్ర­హా­ల­ను ఊరే­గిం­పు­గా ని­మ­జ్జ­నం చే­శా­రు. మా­ర్గ­మ­ధ్య­లో గణ­నా­థు­ల­పై వి­మా­నం­తో పూ­ల­వ­ర్షం కు­రి­పిం­చా­రు. వి­నా­యక శో­భా­యా­త్ర­ను వీ­క్షిం­చేం­దు­కు లక్ష­లా­ది మంది ప్ర­జ­లు రహ­దా­రు­ల­పై­కి వచ్చా­రు. దీం­తో పలు ప్రాం­తా­లు కి­క్కి­రి­సి­పో­యా­యి. మరో­వై­పు ట్రా­ఫి­క్‌ ని­లి­చి­పో­వ­డం­తో.. పో­లీ­సు­లు వా­హ­నా­ల­ను దారి మళ్లి­స్తు­న్నా­రు. వి­నా­యక నవ­రా­త్రి ఉత్స­వా­ల­ను పు­ర­స్క­రిం­చు­కొ­ని దే­శ­వ్యా­ప్తం­గా ప్ర­జ­లు భక్తి­శ్ర­ద్ధ­ల­తో పూ­జ­లు చే­శా­రు. లక్ష­లా­ది మంది భక్తు­లు డప్పు మో­త­ల­కు డ్యా­న్సు­లు వే­స్తూ సం­ద­డి చే­శా­రు. లక్ష­ల్లో భక్తు­లు పా­ల్గొ­న్న ఎలాం­టి ఇబ్బం­దు­లు తలె­త్త­కుం­డా పో­లీ­సు­లు పటి­ష్ట భద్రత ఏర్పా­టు చే­శా­రు.


కానుకగా కిలో బంగారు నెక్లెస్‌

మహా­రా­ష్ట్ర­లో­ని కొ­ల్హా­పు­ర్‌­లో గణ­నా­థు­ని­కి కిలో బం­గా­రు నె­క్లె­స్‌­ను కా­ను­క­గా సమ­ర్పిం­చా­రు. దీని వి­లువ సు­మా­రు రూ.కోటి ఉం­టుం­ద­ని ని­ర్వా­హ­కు­లు చె­బు­తు­న్నా­రు. భక్తుల నుం­చి వి­రా­ళాల రూ­పం­లో సే­క­రిం­చిన ని­ధు­ల­తో­నే హా­రా­న్ని తయా­రు చే­యిం­చి­న­ట్టు తె­లి­పా­రు.

నిమజ్జనం కార్యక్రమంలో సీఎం

దే­శ­వ్యా­ప్తం­గా గణ­ప­తి నవ­రా­త్రి ఉత్స­వా­లు వై­భ­వం­గా జరి­గా­యి. ఈ ఉత్స­వా­ల్లో బొ­జ్జ­గ­ణ­ప­య్య ని­మ­జ్జన ప్ర­క్రియ కొ­న­సా­గు­తోం­ది.  ఈ క్ర­మం­లో­నే మహా­రా­ష్ట్ర సీఎం దే­వేం­ద్ర ఫడ­ణ­వీ­స్‌ ని­వా­సం­లో­నూ గణ­ప­తి ని­మ­జ్జ­నం కా­ర్య­క్ర­మా­న్ని ని­ర్వ­హిం­చా­రు.

Tags:    

Similar News