Bhadkeshwar Mahadev Temple : స్వయంగా సముద్రమే పరమశివుడికి అభిషేకం .. ఎక్కడో తెలుసా?

Bhadkeshwar Mahadev Temple : మహాశివుడికి ఓ సముద్రమే అభిషేకం చేయడం మీరు ఎప్పుడైనా విన్నారా.. అవును ఇది నిజం.. స్వయంగా సముద్రమే ఆ పరమశివుడికి అభిషేకం చేస్తుంది.

Update: 2022-03-12 13:30 GMT

Bhadkeshwar Mahadev Temple : మహాశివుడికి ఓ సముద్రమే అభిషేకం చేయడం మీరు ఎప్పుడైనా విన్నారా.. అవును ఇది నిజం.. స్వయంగా సముద్రమే ఆ పరమశివుడికి అభిషేకం చేస్తుంది.. ఇది ఎక్కడ అని తెలుసుకోవాలన్న ఆసక్తి నెలకొంది కదూ.. గుజరాత్ లోని ద్వారకలో స్తంభేశ్వర్ మహదేవ్ అనే ఆలయం అరేబియా మహాసముద్రం సమీపంలో ఉంటుంది.. పురాతనమైన ఈ శివాలయం అత్యంత ఆకర్షణీయమైనది.

రోజుల్లో కొన్ని గంటలు మాత్రమే ఇక్కడ శివలింగాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఆటుపోట్లు తక్కువగా ఉన్నప్పుడు సముద్రం వెనక్కి వెళ్తుంది.. అప్పుడు భక్తులు ఆలయం లోపలికి వెళ్లి దర్శించుకోవచ్చు.. సముద్రం ముందుకు వచ్చినప్పుడు మాత్రం భక్తులకి అనుమతి ఇవ్వరు. సుమారు 5000 సంవత్సరాల క్రితం అరేబియా సముద్రంలో వెలిసిన శివలింగం ఈ ప్రదేశంలో నిర్మించబడిందని స్థలపురాణం చెబుతుంది. మహాశివరాత్రి రోజున ఇక్కడ పెద్ద ఎత్తున జాతరని నిర్వహిస్తారు.

వర్షాకాలంలో సముద్రం స్వయంగా శివలింగానికి అభిషేకం చేస్తుంది. . ప్రతి సంవత్సరం జూన్/జూలైలో అరేబియా సముద్రం మెల్లగా ఉప్పొంగి ఆలయంలోకి ప్రవేశించే రోజు వస్తుంది. శివలింగానికి అభిషేకం జరిగేంత వరకు ఆలయం మొత్తం నీటిలో మునిగిపోతుంది. ఇక ఈ లింగాన్ని దర్శించుకున్నవారు చేసిన తప్పుల నుంచి విముక్తులవుతారని భక్తుల నమ్మకం. 

Similar News