ఈ ఆలయంలోని కృష్ణునికి ఆకలెక్కువ.. నైవేద్యం సమర్పించడం ఆలస్యమైతే..
అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత కూడా దీపారాధన చేసే.. ప్రపంచంలోని అరుదైన హిందూ దేవాలయం కేరళ రాష్ట్రంలో ఉంది.;
అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత కూడా దీపారాధన చేసే.. ప్రపంచంలోని అరుదైన హిందూ దేవాలయం కేరళ రాష్ట్రంలో ఉంది. అదే కొట్టాయం జిల్లాలో ఉన్న తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం. ఏకాంత సేవ తరువాత కూడా దీపారాదన చేయడం బహుశా ఎక్కడా చూసి ఉండము. కానీ ఈ దేవాలయంలోని కృష్ణుడికి ఆకలి ఎక్కువట.. అందుకే.. స్వామికి సమయానుసారం నైవేద్యం సమర్పించి ఏకాంతసేవ తర్వాత కూడా దీపారాధన చేస్తారు.
ఇందులో భాగంగానే.. ఈ ఆలయ ద్వారాలు గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటాయి. ఇక్కడి కృష్ణపరమాత్మ చాలా ఆకలితో ఉండటం వలన.. ఆలయ అర్చకులు స్వామికి రోజుకు 7 సార్లు మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇలా సమర్పించిన నైవేద్యంలో కొంత భాగం తగ్గడం జరుగుతుంటుంది. దీంతో స్వామివారే ఆ నైవేద్యాన్ని ఆరగిస్తారు అని ఇక్కడి భక్తుల విశ్వసిస్తారు.
ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. ఈ గుడిని మాత్రం తెల్లవారుజామున 2 గంటలకే తెరుస్తారు. సాధారణంగా అన్ని దేవాలయాలలో అలంకరణ, అభిషేకం అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. కానీ ఈ కృష్ణ దేవాలయంలో మాత్రం స్వామికి నైవేద్యం నివేదన చేసిన తర్వాతే అలంకరణ తదితర కార్యక్రమాలు చేస్తారు. స్వామికి నైవేద్యం సమర్పించడంలో కొంత ఆలస్యమైనా, ఆలయ ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా.. ఎంతో దోషంగా భావిస్తారు.
అందుకే అలాంటి సందర్భాల్లో ఆలయ ప్రధాన ద్వారం తెరిచేటప్పుడు ప్రధాన అర్చకులు చేతిలో గొడ్డలి పట్టుకుని సిద్దంగా ఉంటారు. ఏదేని కారణం చేత తాళం పనిచేయకపోయినా, ఒకవేళ తాళం పోయినా, గొడ్డలితో ఆ తాళాన్ని పగలకొట్టి గుడి ద్వారాలు తరచుగా జరుగుతుంటుంది. ఇక ఆలయంలోకృష్ణుడికి సమర్పించే నైవేద్యం చాలా రుచికరంగా ఉంటుంది. స్వామికి నైవేద్యం నివేదించిన అనంతరం భక్తులందరికీ దానిని ప్రసాదంగా పంచుతారు. ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడూ ఆకలితో వెళ్ళకూడదని ఇక్కడి నియమం. అందుకే ఇక్కడి అర్చక స్వాములు ప్రసాదం పంచడం పుర్తయ్యాక.. "ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకోనివారు ఉన్నారా అని పెద్ధగా అరుస్తారు".
ఒకవేళ స్వామికి నైవేద్యం సమర్పించడం ఆలస్యమైతే అది స్పష్టంగా కనిపిస్తుంటుంది ప్రధాన అర్చకులకి. స్వామి కడుపు ఖాళీ అవ్వడం వలన ఆయన నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదులై కొన్ని ఇంచులు క్రిందకు దిగడం జరుగుతుంది.
ఒకసారి గ్రహణ సమయంలో ఈ ఆలయం మూసి ఉంచడం వలన స్వామికి నైవేద్యం సమర్పించడంలో ఆలస్యమైంది. అప్పుడు ఇలాంటి అపశృతి చోటు చేసుకుందని అర్చకుల కథనం. ఆప్పటినుండి గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయ ద్వారాలు తెరిచే ఉంచుతున్నారు.
గ్రహ దోషాలు, గ్రహణ దోషాలు, సంతాన దోషాలు, సర్పదోషాలు, వ్యాపారంలో నష్టం, వివాహ సమస్యలు, బ్రాహ్మణ హత్య వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి కృష్ణ పరమాత్మను దర్శించి, పూజిస్తే దోషాలు నివారింపబడుతాయి అని భక్తులు విశ్వసిస్థారు.
33 కోట్ల దేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు సైతం.. కృష్ణభగవానుడి సేవకులు కనుక ఇక్కడికి వచ్చే కృష్ణభక్తులకు ఎటువంటి జాతక దోషాలు అంటవని స్వామిని భక్తి శ్రద్ధలతో కొలిచి స్వామిని ఆరాధిస్తారు.