Mahashivratri 2021 : ఒకే పానవట్టం మీద రెండు శివలింగాలు.. కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం..!

Mahashivratri 2021 : దట్టమైన అడవులు... చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన, పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ పుణ్యక్షేత్రం చాలా ప్రాచీనమైనది.

Update: 2021-03-11 01:30 GMT

ప్రముఖ సుప్రసిద్ధ శైవక్షేత్రాలలో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న దైవక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం.. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్ పూర్ మండలంలోని కాళేశ్వరం అనే గ్రామంలో ఉంది. దట్టమైన అడవులు... చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన, పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ పుణ్యక్షేత్రం చాలా ప్రాచీనమైనది.

దక్షిణకాశీగా ప్రసిద్ధిచెందన ఇక్కడ శివుడి, యముడి ఆలయాలు ఉండడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.. శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..!

స్థలపురాణం :

ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వరస్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పనిలేకుండా పోయిందట. దీంతో యమధర్మరాజు స్వామినివేడుకోగా, యమున్ని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట . ముక్తేశ్వరున్ని చూచి యమున్ని దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని, కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారని స్థలపురాణం చెపుతుంది.

ముక్తేశ్వరస్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో రెండు రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడికి సమీపంలో ఉన్న గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం..

♦ గర్భగుడిలో రెండు శివలింగాలు ఉండటం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

♦ దేశంలోనే మరెక్కడ లేని విధంగా ఒకే పానవట్టం మీదా రెండు శివలింగాలు ఉండడం ఇక్కడ మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

♦ ఇక్కడ నివసించిన, స్వామి వారిని దర్శించిన, స్మరించిన సకల పాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం...

♦ ఎక్కడ లేని విధంగా ఈ ఆలయానికి నాలుగు వైపులా ప్రవేశ మార్గాలున్నాయి. ఆలాగే ఆ నాలుగు వైపులా ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైపున నందీశ్వరుడు కొలువై ఉంటాడు.

♦ ఈ క్షేత్రంలో చాలా ఉపలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి.. సూర్యదేవాలయం, సరస్వతి దేవాలయం.

♦ మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది. 

Tags:    

Similar News