poli padyami: పొలి పాడ్యమి.. ఆలయాల్లో భక్తుల రద్దీ
poli padyami: పొలి పాడ్యమి పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.;
Poli Padyami: పొలి పాడ్యమి పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాలోని ప్రముఖు ఆలయాలు తిరుమల, శ్రీశైలం, విజయవాడ, యాదాద్రి, భద్రాద్రి, బాసర భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో ఆలయాల అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు కల్పిస్తున్నారు.
విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న ఆలయం భక్తులతో సందడిగా మారింది. పొలి పాడ్యమి పురస్కరించుకుని పుష్కరిణిలో మహిళలు దీపారాధనలు చేశారు. దీపారాధనలతో వరాహ పుష్కరిణి వెలుగులతో కళ్లు మిరుమిట్లు గొలిపే విధంగా దర్శనమిస్తోంది. ఇక పొలి పాడ్యమి దీపారధన ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వచ్చంద సంస్థలు పూజ సామాగ్రిని ఉచితంగా అందజేశారు.
మరోవైపు యానం గౌతమీ గోదావరి తీరానికి భక్తులు పోటెత్తారు. నదీ తీరంలో పొలి పాడ్యమి దీపాలను వదిలి పూజలు చేశారు. గోదావరి తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి.. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో యానం రాజీవ్ బీచ్ శివనామ స్మరణతో మారుమ్రోగింది.
ఇక పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వశిష్ట గోదావరి భక్తులతో కిటకిటలాడింది. పొలి పాడ్యమి పురస్కరించుకుని పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. గట్టుపై కోలువైని శివుడికి పొలి స్వర్గ పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి పట్టణంలోని అమరేశ్వర, కపిల మల్లేశ్వర, జగన్నాథ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.