తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ నిర్వహించిన టీటీడీ

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

Update: 2021-01-29 03:22 GMT

తిరుమలలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. శ్రీమలయప్ప స్వామి.. తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో వివహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతి పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పౌర్ణమి కావడంతో గరుడసేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దీంతో ఆలయ నాలుగు మాఢవీధులు.. గోవింద నామస్మరణతో మార్మోగాయి. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంతేగాక జ్ఞనవైరాగ్య ప్రాప్తికోరే మానవులు.. గరుడిని దర్శిస్తే సర్వపాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం.


Tags:    

Similar News