TTD : వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్ ప్రారంభం… మొదటి గంటలోనే రికార్డు నమోదు

Update: 2025-11-27 06:11 GMT

తిరుమల....బ్రేకింగ్

శ్రీవారి వైకుంఠద్వార దర్శనం టోకన్లు కోసం ఆన్ లైన్ లో ఈ-డిప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న భక్తులు

ఉ 10 గంటలకు ప్రారంభమైన టోకన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. మొదటి గంటలోనే రికార్డ్ స్థాయిలో 2,16,254 మంది భక్తులు నమోదు

టీటీడీ వెబ్సైట్ లో 78,475, టీటీడీ మొబైల్ యాప్ లో 1,27,275 , ఏపీ గవర్నమెంట్ వాట్స్ యాప్ లో 10,504 రిజిస్ట్రేషన్ లు

డిసెంబర్ 30, 31, జనవరి 1...3 రోజులకు సంభందించి వైకుంఠద్వార దర్శనాలకు టోకన్లు ఈ-డిప్ ద్వారా భక్తులకు కేటాయించనున్న టీటీడీ

ఇవాల్టి నుంచి 5రోజుల పాటు టోకన్లు నమోదుకు అవకాశం

డిసెంబర్ 2వ తేదీ ఈ-డిప్ లో టోకను పొందిన భక్తులకు ఫోన్ ద్వార సందేశం

వైకుంఠద్వార దర్శనాల్లో సామాన్యభక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్న టీటీడీ

7 నుంచి 8 లక్షల మంది భక్తులకు వైకుంఠద్వార దర్శన భాగ్యం కల్పించే ఏర్పాట్లు

10 రోజుల పాటు అన్ని ప్రత్యేక, వెసులుబాటు దర్శనాలు రద్ద

మొదటి మూడురోజులు ఆన్లైన్ టోకన్లు కలిగిన భక్తులకు మాత్రం వైకుంఠద్వార దర్శనానికి అనుమతి

చివరి 7 రోజులు ఎలాంటి టోకన్లు, టిక్కెట్లు లేని భక్తులకు కూడా వైకుంఠద్వార దర్శనభాగ్యం

చివరి 7 రోజులకు రోజుకు ...15 వేలు చొప్పున రూ 300 టిక్కెట్లు, 1 వెయ్యి శ్రీవాణి టిక్కెట్లను ఆన్‌లైన్ లో డిసెంబర్ 5వ తేదీ విడుదల

చివరి మూడురోజులు స్థానికులకు ప్రాధాన్యత కల్పిస్తూ....రోజుకు 5వేల టోకన్లు ఆన్ లైన్ లో డిసెంబరు 10వ తేదీ విడుదల

Tags:    

Similar News