అరసవల్లిలో రథసప్తమి వేడుకలు.. సరైన ఏర్పాట్లు చేయలేదని భక్తుల అసహనం
స్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఈ క్షేత్రానికి పోటెత్తారు.;
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో శ్రీసూర్యనారాయస్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వేదమంత్రోచ్ఛారణల మధ్య తెల్లవారుజామునే సూర్యభగవానుడికి క్షీరాభిషేకం చేశారు. స్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఈ క్షేత్రానికి పోటెత్తారు.
ఆరోగ్యప్రదాతగా కీర్తించే స్వామి వారి దర్శనం కోసం 500 రూపాయల టికెట్లు తీసుకున్న వారు కూడా క్యూలైన్లలోనే గంటల తరబడి ఉండిపోవాల్సి వచ్చింది. ఎలాంటి హోదా లేని వారికి VIP దర్శనం కల్పిస్తున్నారని, సమాన్య భక్తుల్ని మాత్రం ఆలయ అధికారులుపట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతోనే చిన్న చిన్న సమస్యలు తలెత్తాయని ఆలయ సిబ్బంది చెప్పుకొస్తున్నారు.