Sabarimala : పొంగి పొర్లుతున్న నదులు.. శబరిమల యాత్రకు అనుమతుల నిరాకరణ..

Sabarimala : పాతనమిట్ట జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పంబా నదితో పాటు ప్రధాన నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి.

Update: 2021-11-20 07:00 GMT

Sabarimala : శబరిమాల యాత్రకు నవంబర్ 20న భక్తులను అనుమతించడం లేదని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. భారీగా కురుస్తున్న వర్షాలు, వరదలో నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. కేరళలో మరీ ముఖ్యంగా పాతనమిట్ట జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పంబా నదితో పాటు ప్రధాన నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి.

ఈ నేపథ్యంలో భక్తులను యాత్రకు అనుమతినివ్వడం శ్రేయస్కరం కాదనే ఉద్దేశంతో నిషేధం విధించినట్లు తెలిపారు. అయ్యప్ప దర్శనం కోసం నవంబర్ 20న స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు వరద ఉద్ధృతి కాస్త నెమ్మదించిన తరువాత స్వామి దర్శనం కల్పించుకునే అవకాశం ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. భక్తులు పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ నవంగర్ 16న ఆలయాలు తెరుచుకోవడంతో మణికంఠుని దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు.

శుక్రవారం శబరిమల ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువడంతో పంబా ప్రాంతం జలమయమైంది. మండలం సీజన్ ప్రారంభమైన తర్వాత శబరిమల యాత్రను నిషేధించడం ఇదే తొలిసారి. భక్తుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News