Sabarimala: శబరిమల క్షేత్రం.. పోటెత్తిన మాలధారులు
శబరిమల క్షేత్రానికి అయ్యప్పమాలదారులు పోటెత్తారు. అర్థరాత్రి నుంచి సర్వదర్శనాలను నిలిపివేశారు.;
Sabarimala: శబరిమల క్షేత్రానికి అయ్యప్పమాలదారులు పోటెత్తారు. అర్థరాత్రి నుంచి సర్వదర్శనాలను నిలిపివేశారు. దీంతో ఆలయం నుంచి పంబా వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. 12 గంటల నుంచి భక్తులు క్యూలైన్లలోనే ఉన్నారు. మూడు లక్షల మంది అయ్యప్పమాలధారులు స్వామి దర్శనానికి తరలివచ్చారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ వేళల్లో మార్పులు చేశారు.