Shabarimala : శబరిమలలో అయ్యప్ప దర్శనానికి 10 గంటల సమయం

Update: 2024-11-22 07:00 GMT

శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దర్శనానికి 10 గంటలకుపైగా సమయం పడుతోంది. అయ్యప్పస్వామి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు పడిగాపులు పడుతున్నారు. గంటకి 3వేల మంది దర్శనం చేసుకుంటున్నారు. సగటున నిమిషానికి 80 మంది అయ్యప్ప భక్తులు దర్శించుకుంటుండగా... 70 నుంచి 80 వేల మంది సన్నిధానానికి వస్తున్నారు. 40 లక్షల అరవణ ప్రసాదం అందుబాటులో ఉంచామని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ తెలిపింది. హోటల్స్‌లో నాసిరకం భోజనంపై భక్తుల ఫిర్యాదులు రావడంతో నాసిరకం భోజనం అమ్ముతున్న హోటల్స్‌కు అధికారులు నోటీసులు ఇచ్చారు.

Tags:    

Similar News