తిరుమలలో ఘనంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు.. !
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు తెప్పపై విహరించారు.;
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు తెప్పపై విహరించారు. అంతకుముందు శ్రీ మలయప్పస్వామి వారి ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించారు. ఆలయ మాడ వీధుల గుండా ఊరేగుతూ పుష్కరిణి వద్దకు చేరుకుంది. మంగళవాయిద్యాలు, వేద పండితుల వేద పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.