Horoscope Today : ఈ రాశివారికి సన్నిహితులతో వివాదాలు... ఆకస్మిక ప్రయాణాలు..!
Horoscope Today : సన్నిహితులతో సఖ్యత. శుభకార్యాలపై చర్చలు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.;
26-07-2021 సోమవారం నేటి పంచాంగం :
శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, తిథి బ.పాడ్యమి ఉ.6.34 వరకు, తదుపరి విదియ తె.5.29 వరకు (తెల్లవారితే సోమవారం) నక్షత్రం శ్రవణం ప.1.04 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం సా.5.01 నుండి 6.34 వరకు దుర్ముహూర్తం సా.4.48 నుండి 5.40 వరకు, అమృతఘడియలు... రా.2.26 నుండి 4.02 వరకు.
సూర్యోదయం : 5.40, సూర్యాస్తమయం : 6.32, రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు, యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
26-07-2021 సోమవారం నేటి రాశిఫలాలు :
మేషం :
ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు
వృషభం:
సన్నిహితులతో సఖ్యత. శుభకార్యాలపై చర్చలు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.పనులు విజయవంతంగా ముగుస్తాయి. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుస్తాయి.
మిధునం:
పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో అకారణంగా వివాదాలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనుకున్న పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు
కర్కాటకం:
ఆత్మీయుల నుంచి పిలుపు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి.
సింహం:
ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. కొన్ని పరిస్థితులకు ఎదురీదవలసివస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. కుటుంబసభ్యులతో వైరం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు.
కన్య:
శ్రమ మరింత పెరుగుతుంది. దూరప్రయాణాలు. వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.
తుల:
గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆస్తి విషయంలో చికాకులు తొలగుతాయి.
వృశ్చికం:
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. పనులు చకచకా సాగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు నిజం కాగలవు.
ధనుస్సు:
కొన్ని పనులు వాయిదా వేయాల్సివస్తుంది. ప్రయాణాలు కుదించుకుంటారు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బంధువులతో మాటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. పనులు మధ్యలో విరమిస్తారు.
మకరం:
మిత్రులతో వివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.ఆకస్మిక ధనలాభం. పరపతి పెరుగుతుంది. పోటీపరీక్షల్లో విజయం.
కుంభం:
వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కొత్త పరిచయాలు. శుభవార్తలు. వాహనయోగం. పనులలో విజయం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
మీనం:
వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.