శ్రీశైలంలో ఘనంగా ఉగాది మహోత్సవాలు..!

శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. మూడవరోజు భ్రమరాంబదేవి మహా సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది.

Update: 2021-04-13 04:45 GMT

శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. మూడవరోజు భ్రమరాంబదేవి మహా సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. అక్కమహాదేవి అలంకార మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాసరస్వతి అలంకార రూపంలో ఉన్న అమ్మవారికి.. నంది వాహనంలో ఉన్న స్వామివారికి వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులు గ్రామోత్సవానికి కన్నులపండువగా బయలుదేరగా.. భక్తజన సందోహంతో ఆలయం పులకించిపోయింది.

ఆలయ ప్రాంగణం నుంచి శ్రీశైలం పురవీధులలో గ్రామోత్సవం సాగుతుండగా ఉత్సవమూర్తుల ముందు గోరవయ్యల ఆటపాటలు, పిల్లన గ్రోవుల నాధాలు, డప్పు వాయిద్యాలు భక్తులను కనువిందు చేశాయి. నంది వాహనంపై ఉన్న స్వామిఅమ్మవార్ల దివ్య మంగళ రూపాన్ని వేలాది మంది భక్తులు కనులారా దర్శించుకొని కర్పూర నీరాజనాలర్పించారు.

Tags:    

Similar News