ఇంటికి ఎంత దూరంలో ఆలయం ఉండాలి.. గుడి నీడ ఇంటిపై పడితే..

దేవాలయం ఒక పవిత్రమైన స్థలం. ఒక ప్రశాంత మందిరం.. ఆలయంలోకి అడుగుపెట్టగాన్ని ప్రాపంచిక బాధలన్నీ మరచిపోయి భక్తులు ఆ దేవుని సన్నిధిలో తన్మయత్వం పొందుతారు.

Update: 2021-12-11 01:45 GMT

దేవాలయం ఒక పవిత్రమైన స్థలం. ఒక ప్రశాంత మందిరం.. ఆలయంలోకి అడుగుపెట్టగాన్ని బాధలన్నీ మరచిపోయి భక్తులు ఆ దేవుని సన్నిధిలో తన్మయత్వం పొందుతారు. శాస్త్రబద్ధంగా నిర్మించిన ఆలయం ఓ శక్తి కేంద్రం. ఆలయంలో ఎల్లప్పుడూ పూజలు, హోమాలు, యాగాలు జరుగుతుంటాయి. అందువల్ల ఆలయం ఉన్న చోట, గుడినీడ ఇంటిపై పడే చోట ఇల్లు కట్టుకోకూడదంటారు శాస్త్రం తెలిసిన వారు. గుడికి ఆనుకొని ఏ ఇల్లు ఉండకూడదు.

ఒకవేళ గుడికి దగ్గర ఇల్లు ఉంటే ఆ కుటుంబలో కలహాలు చోటు చేసుకుంటాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం శివాలయాలకు వెనుక వైపు, విష్ణు ఆలయాలకు ముందు వైపు ఇల్లు ఉండవచ్చని శాస్త్రం చెబుతుంది. ఇంటికి, గుడికి ఉండే దూరాన్ని గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండే పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఏ ఆలయానికి దగ్గరలో తీసుకున్నా కనీసం 200 అడుగుల దూరంలో ఉండేలా ఇల్లు తీసుకుంటే మంచిది.

శివాలయానికి దగ్గరలో ఉంటే శత్రు భయం, విష్ణు ఆలయానికి దగ్గరలో ఉంటే ఇంట్లో డబ్బు నిలవదని చెబుతున్నారు పండితులు. శక్తి ఆలయాలు దగ్గరలో ఉంటే ఆ ఇంట్లోని వారు ఎవరూ వృద్ధి చెందరు. ఏ కార్యక్రమంలోనూ పురోగతి కనిపించదు. ఏ కార్యక్రమం చేపట్టినా ఫలితం శూన్యం. ఇక విఘ్నాలు తొలగించే వినాయకుని ఆలయం ఉత్తరాన, వాయువ్యంలో ఉంటే అక్కడ ఉన్న వారికి ధన నష్టం, అవమానాలు ఎదురవుతాయి. వృధా ఖర్చులు పెడతారట.

ఒకవేళ ఇప్పటికే ఆలయాల నీడ పడే చోట ఇల్లు ఉన్నట్లైతే వాస్తు శాస్త్రజ్ఞుడి అనుమతితో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుని, కుటుంబలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి.

Tags:    

Similar News