CHILDS: తప్పుదారిలో పసి హృదయాలు

టెక్నాలజీతో తప్పుదారి పడుతున్న బాలలు;

Update: 2025-08-18 04:30 GMT

చే­తి­లో ఇమి­డిన సాం­కే­తిక పరి­జ్ఞా­నం పసి హృ­ద­యా­ల­పై చెడు ప్ర­భా­వా­న్ని చూ­పు­తు­న్నా­యి. ఇప్ప­టి­కే కొ­న్ని నే­రా­లు సభ్య సమా­జా­న్నే ది­గ్భ్రాం­తి­కి గు­రి­చే­శా­యి. ఇవి మరింత శృతి మిం­చ­క­ముం­దే ప్ర­భు­త్వం వీటి నే­ప­థ్యం అధ్య­య­నం చేసి, ఇటు­వం­టి నే­రా­లు పు­న­రా­వృ­తం కా­కుం­డా తగు జా­గ్ర­త్త లు తీ­సు­కో­వా­లి. బాలల ఆలో­చ­న­లు ఎం­దు­కు దారి తప్పు­తు­న్నా­యి అనే ప్ర­శ్న­కు జవా­బు వె­త­కా­లి. ఈ పి­ల్ల­లు స్మా­ర్ట్ ఫోన్, పొ­ర్నో­గ్ర­ఫీ వ్య­స­న­ప­రు­ల­ని వా­ర్త­లొ­చ్చా­యి. ఈ రెం­టి పైన ని­యం­త్రణ అవ­స­రం. పో­ర్నో­గ్ర­ఫీ, ఆన్లై­న్ జూదం, సో­ష­ల్ మీ­డి­యాల కబంధ హస్తా­ల­కు బా­ల­లు చి­క్క­కుం­డా చేసే ఈ యు­ద్ధం­లో తల్లి­దం­డ్రు­లు ఒం­ట­రి­గా పో­రా­డ­లే­రు.

చి­న్న వయ­సు­లో­నే పో­ర్నో­గ్ర­ఫీ­కి గు­రి­కా­వ­డం వారి మా­న­సిక ఆరో­గ్యం, ప్ర­వ­ర్త­న­పై తీ­వ్ర ప్ర­భా­వం చూ­పు­తుం­ది. ఇన్‌­స్టి­ట్యూ­ట్ ఫర్ ఫ్యా­మి­లీ స్ట­డీ­స్ ప్ర­చు­రిం­చిన “అన్‌­ప్రొ­టె­క్టె­డ్ ఫ్ర­మ్ పో­ర్న్” ని­వే­దిక ప్ర­కా­రం, 12-18 సం­వ­త్స­రాల వయ­స్సు గల 97% పైగా అబ్బా­యి­లు, 78% మంది అమ్మా­యి­లు పో­ర్నో­గ్ర­ఫీ­ని చూ­శా­రు. 18 ఏళ్లు పై­బ­డి­న­వా­ర­మ­ని బా­ల­లే తమకు తాము స్వ­యం­గా ప్ర­క­టిం­చు­కు­నే పాప్-అప్‌­లు హా­స్యా­స్ప­దం­గా మా­రా­యి. బాలల ఉత్తమ ప్ర­యో­జ­నా­ల­ను పరి­ర­క్షిం­చ­డం అనే­ది ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా బాలల రక్ష­ణ­లో ప్రా­థ­మిక సూ­త్రం. మద్యం, పొ­గా­కు, జూదం వి­ష­యం­లో ప్ర­భు­త్వా­లు ఎలా జో­క్యం చే­సు­కుం­టు­న్నా­యో, పి­ల్ల­లు అడ­ల్ట్ కం­టెం­ట్‌­కు గురి కా­కుం­డా ని­రో­ధిం­చ­డా­ని­కి అదే­వి­ధం­గా జో­క్యం చే­సు­కో­వా­లి. జూలై 2025 నుం­చి యు­నై­టె­డ్ కిం­గ్‌­డ­మ్ తన కొ­త్త ఆన్‌­లై­న్ సే­ఫ్టీ చట్టా­న్ని అమలు చే­స్తోం­ది. దీని ప్ర­కా­రం పో­ర్నో­గ్ర­ఫీ­ని అను­మ­తిం­చే అన్ని సై­ట్‌­లు, యా­ప్‌­లు - సో­ష­ల్ మీ­డి­యా, సె­ర్చ్ ఇం­జి­న్‌­లు, గే­మిం­గ్ సే­వ­ల­తో సహా - అత్యంత ప్ర­భా­వ­వం­త­మైన వయ­స్సు ధృ­వీ­క­రణ తని­ఖీ­ల­ను ఉప­యో­గిం­చా­లి. ఏదై­నా ప్లా­ట్‌­ఫా­ర­మ్ దీ­ని­కి కట్టు­బ­డి ఉం­డ­క­పో­తే, భారీ జరి­మా­నా­లు లేదా సే­వ­ను పూ­ర్తి­గా ని­లి­పి­వే­సే కో­ర్టు ఉత్త­ర్వు­ల­ను ఎదు­ర్కో­వ­ల­సి ఉం­టుం­ది. ఆస్ట్రే­లి­యా 2024లో ఆన్‌­లై­న్ సే­ఫ్టీ అమెం­డ్‌­మెం­ట్ (సో­ష­ల్ మీ­డి­యా మి­ని­మ­మ్ ఏజ్) చట్టా­న్ని ఆమో­దిం­చిం­ది.

Tags:    

Similar News