వామ్మో విశాఖ..!
ఇప్పుడు ఏపీ ప్రజలు వామ్మో విశాఖ అంటున్నారు. నిన్న సాగర తీరంలో జరిగిన కిడ్నాప్ వ్యవహారంలో అనేక అనుమానాలకు తావిస్తున్నాయి;
ఇప్పుడు ఏపీ ప్రజలు వామ్మో విశాఖ అంటున్నారు. నిన్న సాగర తీరంలో జరిగిన కిడ్నాప్ వ్యవహారంలో అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఏకంగా ఎంపీ కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేశారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆర్ధం అవుతుంది. వైసీపీ ఎంపీల్లోనే అత్యంత పవర్‌ఫుల్ ఎంపీగా పేరున్న ఎంవీవీ ఇంట్లోనే కిడ్నాప్ జరిగిందంటే సీసీ కెమెరాలు లేవా...? అసలు ఇంట్లో సెక్యూరిటీ వాళ్లు ఏమయ్యారు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. బందీ, కిడ్నాప్‌లపై పొంతన లేని సమాధానాలు ఇచ్చారు పోలీసులు. ఓ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం చిన్న విషయమా ?ఇది ఏపీనా..? బీహారా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.కిడ్నాప్ వెనుక భూ దందాల నేపధ్యమా..? లేక వైసీపీ అంతర్గత కుమ్మలాటలో భాగమా.. అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ తో ఉలిక్కిపడ్డ విశాఖ నగర వాసులుప్రశాంతమైన విశాఖలో ఎంత మార్పు అంటున్నారు.
ఇక ఈ కిడ్నాప్ స్టోరిలో అనేక అనుమానాలు కలుగుతున్నాయి.ఒక రౌడీ షీటర్...ఏకంగా ఎంపీ కుటుంబ సభ్యులను టార్గెట్ చేయడం పోలీసు వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది. స్వయంగా ఎంపీ కుమారుడిని 48 గంటలపాటు, ఎంపీ భార్యను 24 గంటలపాటు బందీగా పట్టుకున్నా ఎవ్వరికీ తెలియకపోవడం మరో మిస్టరీ.ఉదయం 8గంటల సమయంలో ఎంపీ కుమారుడి నివాసంలోకి హేమంత్‌కుమార్, రాజేష్, మరికొందరు కిడ్నాపర్లు ప్రవేశించారని సీపీ త్రివ్రికమ వర్మ చెప్పారు. బుధవారం 8గంటలకు ఎంపీ హైదరాబాద్ బయలుదేరే దాకా, ఆ తర్వాత కుమారుడితో ఫోన్‌లో మాట్లాడారు. ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ... బందీలుగా ఉన్న వ్యక్తులు ఏమాత్రం అనుమానం రాకుండా చాలా మామూలుగా ఫోన్‌లో మాట్లాడటం సాధ్యమా?రుషికొండలోని విల్లా వద్ద సెక్యూరిటీ గార్డు, ఇంట్లో పని మనుషులు ఏమయ్యారు? ఇంట్లోకి అపరిచితులు ప్రవేశించారని ఎంపీకి సమాచారం ఇవ్వలేదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
డబ్బు కోసమే కిడ్నాపర్లు ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు. 48 గంటల పాటు నిర్బంధంలో ఉంచుకున్నారు. వారి వద్ద నుంచి డబ్బు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు.వాళ్లను ఎక్కడికో తీసుకెళ్తూంటే.. ఫోన్ లోకేషన్ ట్రాక్ చేసి పట్టుకున్నాం.. ఇదీ పోలీసుల వివరణ. అయితే ఆ ట్రాక్ చేసిన ఫోన్ వారి దగ్గర లేదు. వారెక్కడో దిగిపోయారు. మరి ఫోన్ ఎలా ట్రాక్ చేశారో వారికే తెలియాలి. ఇదే పెద్ద లూప్ హోల్ అనుకుంటే.. అసలు ఎలాంటి సీసీ కెమెరా సాక్ష్యాలు లేవు..అసలు తెర వెనుక ఏం జరగలేదు.. డబ్బు కోసమే కిడ్నాప్ చేశారని స్వయంగా సీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు.
ఇక విశాఖను రాజధానిగా చేస్తామని జగన్ సర్కార్ చెపుతుండటంతో భూబకాసురులు అందరూ వచ్చి విశాఖ మీద వాలిపోయి పోటీలు పడి భూములు కబ్జాలు చేస్తున్నారు. దసపల్లా భూముల వ్యవహారం చాలా రోజులు వార్తలలో నానిన సంగతి అందరికీ తెలిసిందే.విశాఖలో ఇంతవరకు భూకబ్జాలనే చూశారు..ఇప్పుడు ఏకంగా అధికార పార్టీకే చెందిన ఓ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ కాబడటంతో విశాఖ నగర ప్రజలు ఉలిక్కి పడ్డారు.ఓ ఎంపీ కుటుంబం పరిస్థితే ఈ విధంగా ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏవిదంగా ఉంటుందో? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అవడం చూస్తే ప్రశాంతమైన విశాఖనగరంలో పరిస్థితులలో ఎంత మార్పు వచ్చిందో ఊహించుకోవచ్చు.