టాలీవుడ్‌పై BJP నజర్
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న BJP.. టాలీవుడ్‌పై గురిపెట్టిందా? తెలుగు సినీ తారలతో కమలం పార్టీ పెద్దల భేటీల వెనుక ఆంతర్యం ఏంటి?;
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న BJP.. టాలీవుడ్‌పై గురిపెట్టిందా? తెలుగు సినీ తారలతో కమలం పార్టీ పెద్దల భేటీల వెనుక ఆంతర్యం ఏంటి? పార్టీ బలోపేతం కోసం సినీ సెలబ్రిటీల ఇమేజ్‌ను కాషాయ పార్టీ క్యాష్ చేసుకోవాలని చూస్తోందా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి.
ప్రధాన మంత్రి మోదీ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడల్లా సెలబ్రిటీలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఆ మధ్య సినీ స్టార్స్ జూనియర్ NTR, నితిన్, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్‌తో అమిత్‌షా భేటీ కాగా.. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు రాజమౌళితో షా భేటీ కాబోతున్నారు. ఇప్పటి వరకూ సెలబ్రిటీలతో జరిగిన భేటీల్లో ఏం చర్చించారు? ఇప్పుడు రాజమౌళితో ఏం చర్చించబోతున్నారన్నది హాట్ టాపిక్‌గా మారింది.
ఇవాళ రాత్రికి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. పర్యటనలో భాగంగా ఖమ్మంలో జరిగే BJP బహిరంగ సభలో షా పాల్గొననున్నారు. అదే రోజు టాలీవుడ్‌కు చెందిన రాజమౌళీతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. అమిత్ షా ఒక్క తెలంగాణలోనే కాదు.. వివిధ రాష్ట్రాల్లో పర్యటించినప్పుడల్లా ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో భేటీ అవుతూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు రాజమౌళితో భేటీ అవుతున్నారని BJP వర్గాలు చెబుతున్నాయి.