మరో అల్పపీడన ద్రోణి

విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించనున్న ద్రోణి....

Update: 2023-05-23 06:44 GMT

బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి ఏర్పాటు అవ్వడంతో రానున్న 24 గంటల్లో పలు  చోట్ల ఉరుమురు, పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఈ ద్రోణి విస్తరించి ఉంది. అయితే ద్రోణి ఏర్పాటు అయినప్పటికీ వాతావరణం చల్లబడటంలేదు. సముద్రం పైనుంచి వీస్తోన్న గాలులతో వాతావరణంలో అనిశ్చితి ఏర్పడింది. మరోవైపు కోస్తాలో గంటకు 40 నుంచి 50, రాయలసీమలో 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు నంద్యాలలో అత్యధింగా 40.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయింది. రాబోయే రెండు రోజులూ తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగి, ఉక్కపోతకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. 

Tags:    

Similar News