Chattisgarh Maoists Encounter : ఎన్ కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులో జిరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్, నౌపాడలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిన్న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. తెల్లవారుజాము నుంచి జరిపిన గాలింపులో మరో 18 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే భారీస్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఇందులో వెయ్యిమంది వరకు భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది.