సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై అశోక్ అంత్యక్రియలు నరసాపురంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.ఎస్సై పార్థివ దేహాన్ని అంబులెన్స్ లో ఆయన స్వస్థలం నరసాపురం పట్టణానికి తీసుకువచ్చారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్., కోనసీమ ఎస్పి కృష్ణారావు, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి మరియు పలువురు పోలీస్ అధికారు అశోక్ పార్ధవదేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.ఎస్ఐ అశోక్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.సామాన్య కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన ఆయన కష్టపడి చదివి పోలీస్ శాఖలో ఉద్యోగం సంపాదించారు.త్వరలో సీఐ పదోన్నత జాబితాలో ఉన్నారు. అశోక్ మృతితో ఆయన ఇంటి పరిసరాలు శోకసంద్రంగా మారాయి.