Rajdhani files సినిమా విడుదలకు ఏ.పి. హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
రాజదాని ఫైల్స్ సినిమా విడుదలకు తొలగిన అడ్డంకులు సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏ.పి. హైకోర్ట్;
‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రివైజింగ్ కమిటీ అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాకే ధ్రువపత్రం జారీ చేసిందని స్పష్టం చేసింది. సీఎం జగన్, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమాను తీశారని..గతేడాది డిసెంబర్ 18న సీబీఎఫ్‌సీ జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ నెల 13న విచారణ జరిపిన కోర్టు.. సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్లు సక్రమేనన్న హై కోర్టు ,సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలువరిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా శుక్రవారం విచారణ చేపట్టి చిత్రం విడుదలకు అంగీకారం తెలిపింది.