ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు.ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నందున ఎలాంటి షరతులు లేకుండానే తీర్పును ప్రకటించింది. భరణం కింద ధనశ్రీకి 4.75 కోట్లు చెల్లించేందుకు ఛాహల్ ఇప్పటికే అంగీకరించాడు. అందులో 2.37 కోట్లు విడాకులు మంజూరు కాకముందే ఛాహల్ చెల్లింలినట్లు తెలుస్తోంది.
మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో చాహల్ బిజీగా వుంటాడు. అందువల్ల మార్చి 20న విడాకుల పిటిషన్ పై విచారణ జరిపి తీర్పును ప్రకటించాలని ఛాహల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కారణంగానే ఇవాళ కోర్టు విడాకులు ప్రకటించింది.ఈసారి పంజాబ్ కింగ్స్ తరపున చాహల్ ఆడుతున్నాడు. ఈ ఏడాది జరిగిన వేలంలో ఛాహల్ ను 18 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.ఈ విడాకుల వివాదం నడుస్తున్న కారణంగానే మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ ప్రాక్టీస్ కి ఇప్పటివరకు హాజరుకాలేదు.ఛాహల్, ధనశ్రీలు 2020 లో వివాహం చేసుకున్నారు. దాదాపు రెండు సంవత్సరాలుగా వీరిద్దరూ విడివిడిగా వుంటూ, సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో విడిపోతున్నారని పలు కథనాలు హల్ చల్ చేసాయి.