హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం కామన్. అయితే ఇదే అదనుగా కొందరు తమలోని ఆకతాయితనాన్ని బయటకు తీస్తారు. ఇది పరిధిలో ఉంటే పర్లేదు కానీ హద్దు దాటితేనే సమస్య. ఎదుటి వారి ఇష్టంతోనే వారిపై రంగులు చల్లేందుకు ప్రయత్నించండి. పండగ పేరుతో ఇతరులను ఇష్టం వచ్చినట్లు తాకి, రంగులు పూసి ఇబ్బంది పెట్టకండి. ముఖ్యంగా తెలియని వారి విషయంలో హుందాగా వ్యవహరించండి.
హోలీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నేడు పబ్లిక్ హాలిడే ఉంది. అన్ని రకాల విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతబడనున్నాయి. శనివారం నుంచి రెండు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు ప్రారంభం అవుతాయి. ఏపీలో ఉ.7.45 నుంచి మ.12.30 వరకు, తెలంగాణలో ఉ.8 నుంచి మ.12.30 గంటల వరకు స్కూళ్లు నడుస్తాయి.
హోలి అంటేనే రంగుల పండుగ. కలర్స్ ఒకరిపై ఒకరు చల్లుకునే సమయంలో కళ్లలో పడకుండా కళ్లద్దాలు పెట్టుకోవడం ఉత్తమం. కృత్రిమ రంగులు కాకుండా ఆర్గానిక్ రంగులను ఉపయోగించేలా చూడండి. శరీరానికి నూనె అప్లై చేయడం ద్వారా రంగులను త్వరగా శుభ్రం చేసుకోవచ్చు. రంగులు శరీరంపై పడకుండా ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించండి. చెరువులు కాలువలు, జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. అప్రమత్తంగా ఉండండి.