Chittoor : గ్యాస్ ట్యాంకర్, ఆటోల కంటైనర్ ఢీ.. భారీగా మంటలు.. ఆస్తినష్టం

Update: 2025-03-29 13:15 GMT

ఆగి ఉన్న గ్యాస్ ట్యాంకర్ ను కంటైనర్ ఢీకొనడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్ గాయపడ్డారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కల్లూరుపల్లి రెవెన్యూ పరిధిలో బోడబండ్ల క్రాస్ వద్ద హెయిర్ గ్యాస్ ట్యాంక్ టైర్ పంచర్ అయింది. డ్రైవర్ పంచర్ వేస్తున్న సమయంలో వెనుకవైపు వచ్చిన కంటైనర్ ఆగి ఉన్న ట్యాంకర్ ని ఢీకొట్టింది. ముందు వైపు ఉన్న గ్యాస్ ట్యాంకర్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్ కి గాయాలు కావడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి డ్రైవర్ ను తరలించారు. వెంటనే హుటాహుటిన అగ్ని మాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కంటైనర్ లో ఆటోలు కాలిపోయాయి. ఉదయం ఆరున్నర గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

Tags:    

Similar News