ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని సేవలూ ఒకేచోట అందించే రైల్‌వన్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వార్షికోత్సవం సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ యాప్ ను ప్రారంభించారు. దీని సాయంతో రిజర్వ్‌డ్-అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు, ప్లాట్‌ఫామ్ టికెట్లు, రైళ్ల ఎంక్వైరీ, పీఎన్‌ఆర్, జర్నీ ప్లానింగ్, ఫుడ్ ఆన్ ట్రైన్ వంటి సేవలు పొందొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ సేవలన్నీ ఆన్ లైన్, యాప్ రూపంలో వేర్వేరుగా ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. వీటన్నంటిని ఒకే చోటకు తెస్తూ రైల్ వన్ యాప్ ను రైల్వే శాఖ తీసుకొచ్చింది. దీన్ని కొన్ని నెలలుగా పరీక్షించిన రైల్వేశాఖ.. ఎట్టకేలకు ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. రానున్న కాలంలో మరిన్ని సేవలను యాడ్ చేసే అవకాశం ఉంది.