సినీ నటుడు, నిర్మాత మోహన్‌బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఘటనలో ఆయన గాయపడ్డారు. అప్పటి నుంచి ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న మోహన్‌బాబు కాస్త కోలుకున్నారు. వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
జర్నలిస్టు దాడిపై మోహన్‌బాబు మీడియాకు ఆడియో మెసేజ్ పంపారు. జర్నలిస్టులను కొట్టాలని దైవసాక్షిగా అనుకోలేదని ఆడియోలో పేర్కొన్నారు. తనకు మైక్ తగలబోయింది..కానీ తప్పించుకున్నానని తెలిపారు. జరిగిన ఘటనకు బాధపడుతున్నా..అతనూ తనకు తమ్ముడే అన్నారు మోహన్‌బాబు