మూలిగే నక్కపై తాటికాయ చందాన ఆక్వా పరిస్థితి ఉంది. ధరలు పద్ద తగ్గుదల, వ్యాధులు, పీడ్ ధరలు పెరిగి పోవడం వంటి అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆక్వా రంగంపై ప్రకృతి కన్నెర్ర చేసింది. గత కొన్ని రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులు ఆక్వాకు పెనుగండంగా మారాయి. ఎండల తీవ్రత ఆదిరంగా ఉండి ఒక్కసారిగా మబ్బులు, చిరుజల్లులుతే వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులతో రొయ్య రైతులను ఇబ్బందులు పాలు చేస్తున్నది. చెరువుల లోని నీరు కూడా వేడెక్కిన పరిస్థితి నుంచి ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులతో రొయ్యలు ఉక్కిరిబిక్కిరి అయ్యి తట్టుకోలేక వ్యాధులు బారిన పడుతున్నాయి. వాతావరణం ఉక్కబోతగా ఉండటంతో నీటిలో ఆక్సిజన్ తగ్గిపోవడంతో రొయ్యలు చనిపోతున్నాయి. అంతేకాకుండా నీటి పారామీటర్స్ మార్పులు రావడం వల్ల రొయ్యలు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి చనిపోతున్నాయి.. ప్రధానంగా బ్యాక్టీరియా లోడ్ ఎక్కువగా అవడంతో పంట తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విట్రోలోడ్లు వస్తే మందులు కూడా పనిచెయ్యవని, పట్టుకుని అయినకాడికి అమ్ముకోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు. వాటర్ టెస్టింగ్ పీస్ టెస్టింగ్ల పేరుతో రైతులు ల్యాబ్లు చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే సాగు బాగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ధరలు మాత్రం ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా లేదని, ప్రభుత్వం 240 రూపాయలకు 100 కౌంబు ప్రకటించగా ప్రస్తుతం 220కే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో ధరలు మరింత తగ్గించే స్తారని రైతులు. భయాందోళనలు చెందుతున్నారు.. ప్రభుత్వం పట్టించుకుని రైతులకు అండగా నిలబడాలని కోరుతున్నారు.