Telugu State High Courts : తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త జడ్జిలు

Update: 2025-07-04 08:15 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. జడ్జిల నియామకానికి మార్గం క్లియర్ చేస్తూ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజయం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల హైకోర్టులకు కలిపి మొత్తం ఐదుగురు కొత్త జడ్జిల పేర్లను సుప్రీంకోర్టు కొలీజయం సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తుల పేర్లను కొలీజయం ప్రతిపాదించింది. వీరిలో సుద్దాల చలపతిరావు, గాడి ప్రవీణ్ కుమార్, వాకిటి రామకృష్ణారెడ్డి, గౌస్ మీరా మొహిద్దీన్ ఉన్నారు. అదేవిధంగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ పేరును సిఫారసు చేసింది. జూన్ 2న జరిగిన సమావేశంలో సుప్రీంకోర్టు కొలీజయం ఈ ఐదుగురి పేర్లను ఖరారు చేయగా.. కేంద్రం ఆమోదం తర్వాత వారి నియామకాలు అధికారికంగా ఖరారు అవుతాయి.

Tags:    

Similar News