Pope Francis : పోప్ అస్తమయం.. ఈస్టర్ మరునాడే!

Update: 2025-04-21 11:15 GMT

క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. నిన్న ఈస్టర్ వేడుకల్లో కూడా పోప్ పాల్గొన్నారు. చాలాకాలంగా నిమోనియాతో బాధపడుతున్నట్లు వాటికన్ కామెరెలెంగో ప్రకటించింది. 1936 డిసెంబర్ 18న అర్జెంటీనాలో పోప్ ఫ్రాన్సిస్ జన్మించారు. 2013 మార్చి 13 నుండి రోమన్ కాథలిక్ చర్చి యొక్క 266వ పోప్‌గా సేవలు అందిస్తున్నారు. అమెరికా నుంచి పోప్‌గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా ఆయన ఖ్యాతి గడించారు.

పోప్ ఫ్రాన్సిస్ 2025 ఫిబ్రవరి, మార్చిలో రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రిలో 38 రోజుల పాటు బైలాటరల్ న్యూమోనియాతో బాధపడ్డారు. ఈ సమయంలో ఆయన రెండు సార్లు తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యంతో జీవన్మరణ స్థితిని ఎదుర్కొన్నారు. ఫిబ్రవరి 28న ఒక సందర్భంలో, ఆయన ఊపిరితిత్తుల్లో సమస్యల కారణంగా శ్వాస తీసుకోలేక వాంతి చేసుకున్నారు. ఇది ఆయన ఆరోగ్య పరిస్థితిని మరింత దిగజార్చింది. అనంతరం కొద్ది కొద్దిగా ఆరోగ్యం విషమించడంతో ఈ రోజు చివరి శ్వాస విడిచారు.

Tags:    

Similar News