ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మరోసారి వివాహ బంధం లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఓ టాలీవుడ్ హీరోతో ఆమె డేటింగ్‌లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే వాళ్ళిద్దరూ కాఫీ షాపులో మీట్ అయిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అయితే దీనిపై ఎలాంటి అఫిషియల్ ప్రకటన రాలేదు.
కాగా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన కొడుకు ఆలనా పాలన చూసుకుంటూ సింగిల్ మదర్ బాధ్యతలు తీసుకున్నారు సానియా. అంతకుముందు క్రికెటర్ మహమ్మద్ షమీని పెళ్లి చేసుకుంటుందని వార్తలు వినిపించాయి. షమీతో పెళ్లి అవాస్తవమని ఆమె తండ్రి క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్స్‌కు చెక్ పడింది. ప్రజెంట్ టాలీవుడ్ హీరోతో రెండో పెళ్లి టాపిక్ మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో రానున్న రోజుల్లో తెలుస్తోంది.