Terror Camps : ఉగ్ర స్థావరాల ఉపగ్రహ చిత్రాలు వైరల్

Update: 2025-05-08 13:30 GMT

ఆపరేషన్ సిందూర్ కు చేపట్టిన భారత సైన్యాయానికి దేశం యావత్తూ జేజేలు పలు కుతోంది. ఈ తరుణంలో రెండు ఉగ్రస్థావరా లను ఎలా గుర్తించారు.. ఎలా మట్టుపెట్టామ న్న విషయాలకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారత సాయుధ దళాలు కచ్చితమైన సైనిక దాడులు నిర్వహించిన ఒక రోజు తర్వాత, కొత్త ఉపగ్రహ చిత్రాలు బయటికి వచ్చాయి. మాక్సర్ టెక్నాల జీస్ నుంచి వచ్చిన ఉపగ్రహ చిత్రాల్లో దాడికి ముందు, తరువాత దృశ్యాలను చూడొచ్చు. నిషేధిత ఉగ్రవాద సంస్థల రెండు ప్రధాన కేంద్రాలు బహవల్పూర్, మురిడ్కేలోని ఉగ్ర వాద శిబిరాలపై ఆపరేషన్ ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ దాడుల్లో బహవల్పూర్లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం, మురీద్కే లోని లష్కరే తయ్యిబా ఉగ్ర క్యాంప్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటి శాటిలైట్ చిత్రాలను మాక్సర్ టెక్నాలజీ తీసింది. భారత్ జరిపిన క్షిపణి దాడితో బహవల్పూర్ లోని మర్కజ్ సుబాన్ డోమ్ కూలిపోయింది. ఇక, మురీద్కే లోని లష్కరే శిబిరం పూర్తిగా నేలమట్టమైనట్లు ఆ చిత్రాల్లో ఉంది. 25 నిమిషాల పాటు భారత్ ఈ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. పాక్ సైనిక స్థావరాలు, నివాసాలపై దాడి చేయకుండా కేవలం ఉగ్ర శిబిరాల లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 80 మంది ఉగ్రవాదులను హతమార్చింది.

Tags:    

Similar News