YS Jagan : జగన్ లో భయం.. అందుకే విష ప్రచారమా..?

Update: 2026-01-10 14:00 GMT

జగన్ పాలనలో అభివృద్ధి అనే మాటే లేకుండా విధ్వంసం సృష్టించారు. ఏపీకి రాజధాని లేకుండా చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయేలా చేశారు. పెట్టుబడిదారులను బెదిరింపులకు గురిచేసి ఏపీ వదిలి పోయేలా చేశారు. ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి వేధిస్తూ అరాచక పాలన సాగించారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో మూడు ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వస్తూ అభివృద్ధి వేగంగా జరుగుతుంది. అమరావతి రాజధాని పనులు కూడా శరవేగంగా జరుగుతూ ముందుకు సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనుల్లో వేగం పెంచుతున్నారు. త్వరలో రాబోయే కేంద్ర బడ్జెట్ లోను ఏపీకి ప్రత్యేక నిధులు వచ్చేలా చంద్రబాబు నాయుడు చర్చలు జరుపుకున్నారు. అదే జరిగితే ఏపీ అభివృద్ధికి అడ్డు లేకుండా పోతుంది.

మూడు ప్రాంతాలకు సమానంగా అంతర్జాతీయ స్థాయి కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రజలంతా కూటమిపాలనను మెచ్చుకుంటున్నారు. ఇది గమనించిన జగన్ కు అభివృద్ధి భయం పట్టుకుంది. ఏపీ అభివృద్ధి జరిగితే తనను ప్రజలు పట్టించుకోరు అని ఆయన డిసైడ్ అయ్యారు. అందుకే కూటమి హయాంలో అభివృద్ధి జరగద్దని కుట్రలకు తెరతీస్తున్నారు. అందులో భాగంగానే మొన్న పిపిపి విధానంలో పెట్టుబడులు ఎవరైనా పెడితే తాను వచ్చాక జైల్లో వేస్తానంటూ బెదిరింపులకు గురి చేశారు. ఇప్పుడు అమరావతిలో పెట్టుబడులు పెట్టే వారిని బెదిరించేందుకు మున్న ప్రెస్ మీట్ పెట్టారు జగన్. అమరావతి నిండా మునిగిపోతుందని.. దానికి చట్టబద్ధత లేదని అది పూర్తి చేయడం చాలా కష్టం అంటూ విష ప్రచారం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న కాంట్రాక్టర్లు అందరూ కూడా భయపడి పారిపోయేలా చేయడమే జగన్ అసలు ఉద్దేశంలా కనిపిస్తోంది.

జగన్ తీరును చూసిన ప్రతి ఒక్కరు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ అభివృద్ధి చెందితే ఓర్చుకోలేక ఇలా మాట్లాడటం ఏంటి అంటున్నారు. ఒక మాజీ సీఎం నుంచి ఇలాంటి మాటలు ఎవరు ఊహించలేదని చెబుతున్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి ఏపీ అభివృద్ధి కోరుకోవాలి. ఎవరు అధికారంలో ఉన్న సరే ప్రజలకు మంచి జరగాలని సహకరించాలి. అంతేగాని ఏపీ ప్రజల మీద ఇంత కక్షకట్టడం ఎందుకు అని కూటమినేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ లాంటి రాజకీయ నేత ఏ రాష్ట్రానికి ఉండకూడదని చెబుతున్నారు.

Tags:    

Similar News